![తమిళనాడు గవర్నర్‌కు కరోనా](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/08/TAMILNADU-GOVERNORFF.jpg?fit=800%2C458&ssl=1)
చెన్నై: తమిళనాడులో కరోనా వైరస్ విలయ తాండవం చేస్తున్నది. తాజాగా ఆ రాష్ట్ర గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్‌కు కరోనా సోకింది. దీంతో ఆయన చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం గవర్నర్ భన్వరిలాల్ ఆరోగ్యం నిలకడగా ఉన్నదని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఇటీవల గవర్నర్‌ను కలిసిన వారంతా హోం క్వారంటైన్‌కు వెళ్లారు.