Breaking News

ఢిల్లీలో కరోనా రెస్పాన్స్‌ ప్లాన్‌

న్యూఢిల్లీ: దేశంలోనే అత్యధిక కేసులు నమోదై.. మహారాష్ట్ర తర్వాతి ప్లేస్‌లో ఉన్న ఢిల్లీలో కరోనా అదుపు చేసేందుకు ప్రభుత్వం తీవ్ర కసరత్తలు చేస్తోంది. ఈ మేరకు కరోనా వైరస్‌ రెస్పాన్స్‌ ప్లాన్‌ను అధికారులు రివైజ్‌ చేశారు. దాంట్లో భాగంగానే జులై 6 నాటికి ఢిల్లీలోని ప్రతి ఇంట్లో కరోనా టెస్టులు నిర్వహించాలని ప్లాన్‌ చేసుకున్నారు. కంటైన్మెంట్‌ జోన్లలో ఈనెల 30 నాటికి స్క్రీనింగ్‌ కంప్లీట్‌ చేయాలని టార్గెట్‌ ఫిక్స్‌ చేసుకున్నారు. ఢిల్లీలో కరోనా వైరస్‌కు సంబంధించి ఈ నెల 27 నుంచి సర్వే మొదలుపెట్టేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఎన్‌సీడీసీ, ఢిల్లీ ప్రభుత్వం సంయుక్తంగా దీన్ని నిర్వహించనున్నారు. రివైజ్డ్‌ కోవిడ్‌ ప్లాన్‌ ప్రకారం ఢిల్లీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఢిల్లీలో రోజు రోజుకు కేసులు పెరిగిపోతున్నాయి. మంగళవారం ఒక్కరోజు దాదాపు 3900 కేసులు నమోదయ్యాయి. దీంతో కేసుల సంఖ్య 66వేలు దాటింది.
జిల్లాల పరిధిలో అధికారుల అప్రమత్తం
జిల్లాల పరిధిలోని సర్వేలైన్స్‌ టీమ్స్‌ను అప్రమత్తం చేసి, వాళ్లు పరిస్థితిని సమీక్షించేలా ప్రాణాళిక రూపొందించారు. ఆరోగ్య సేతును మానిటర్‌‌ చేసేందుకు ఐటీ ప్రొఫెషనల్స్‌ను నియమించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు మానిటర్‌‌ చేసేందుకు డీసీపీ, మున్సిపల్‌ డీసీ, జిల్లా ఎపిడమాలజిస్ట్‌, డిస్ట్రిక్ట్‌ సర్వేలైన్స్‌ ఆఫీసర్‌‌ (డీఎస్‌వో)తో టీమ్‌ను ఏర్పాటు చేశారు. ఆ టీమ్‌కు డిస్ట్రిక్ట్‌ టాస్క్‌ ఫోర్స్‌ డీఎం హెడ్‌గా ఉంటారు.
కంటైన్మెంట్‌ జోన్లలో ప్రత్యేక చర్యలు
కంటైన్మెంట్‌ జోన్లలో స్ట్రిక్ట్‌ రూల్స్‌ పాటించేలా చర్యలు తీసుకుంటారు. ఎక్కువ పాపులేషన్‌ ఉన్న ప్రదేశాల్లో కేసులు వస్తే పేషంట్లను కరోనా కేర్‌‌ సెంటర్లకు తరలించే ఏర్పాట్లు. కంటైన్మెంట్‌ జోన్లలో ప్రజలు సోషల్‌డిస్టెంసింగ్‌ పాటించే విధంగా పోలీసులను నియమిస్తారు. సీసీటీవీలు, డ్రోన్ల సాయంతో పర్యవేక్షిస్తారు.