Breaking News

ఢిల్లీ– గుర్గావ్‌ రోడ్‌ క్లోజ్‌

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో రోజు రోజుకు కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో హర్యానా ప్రభుత్వం ఢిల్లీ–గుర్గావ్‌ రోడ్‌ను క్లోజ్‌ చేసింది. కాగా కేవలం కార్లను మాత్రమే అనుమతిస్తుండడంతో ప్రజలు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. తమను పనులకు పంపించాలని, నడిచి వెళ్లేందుకు అనుమతించాలని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం ఉదయం రోడ్డుపై ధర్నాకు దిగారు. దీంతో హర్యనా ఢిల్లీ బోర్డర్‌‌లో పెద్దఎత్తున వాహనాలు నిలిచిపోయియి. నడిచి వెళ్లేవారు, సైకిళ్లపై పనులకు వెళ్లేవాళ్లను కూడా అనుమతించాలని డిమాండ్‌ చేస్తూ రోడ్డుపై బైఠాయించి తమను పనులకు వెళ్లనివ్వాలని పోలీసులను కోరారు. వాళ్లంతా రోడ్డుపై కూర్చొని ఆందోళనకు దిగటంతో ఢిల్లీ–గుర్గావ్‌ రోడ్డుపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఢిల్లీ బోర్డర్‌‌లోనే కేసులు అధికంగా ఉన్నాయని, అందుకే కేవలం నిత్యావసర సరకుల రవాణాకు మాత్రమే అనుమతిస్తున్నామని హర్యానా మంత్రి అనిల్‌ విజ్‌ చెప్పారు. ఢిల్లీ నుంచి హర్యానాకు వచ్చే వారి వల్లే కేసులు పెరుగుతున్నాయని ఆయన అన్నారు.