మాడ్రిడ్: కరోనా విజృంభణ ముందు టోర్నీలు వాయిదా పడుతూనే ఉన్నాయి. తాజాగా టెన్నిస్‌లో ప్రతిష్టాత్మకమైన డేవిస్ కప్, ఫెడ్ కప్‌ను వచ్చే ఏడాదికి వాయిదావేశారు. షెడ్యూల్ ప్రకారం ఈ నవంబర్‌లో మాడ్రిడ్ వేదికగా డేవిస్ కప్ ఫైనల్స్ జరగాల్సి ఉన్నాయి. కానీ వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉండడంతో వచ్చే ఏడాది నవంబర్‌కు వాయిదా వేశారు. ఇప్పటికే అర్హత పొందిన 18 జట్లు ఇందులో బరిలోకి దిగుతాయి. మరోవైపు బుడాపెస్ట్‌లో నిర్వహించాల్సిన ఫెడ్ కప్‌ను ఏప్రిల్ 2021కు వాయిదా వేశారు. ప్లే ఆఫ్స్ మ్యాచ్‌ను కూడా వాయిదా వేయడం గమనార్హం.
- June 27, 2020
- Top News
- CARONA
- DAVIS CUP
- డేవిస్ కప్
- మాడ్రిడ్
- Comments Off on డేవిస్ కప్.. ఇక వచ్చే ఏడాది