సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో వాయిదాపడి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ భవితవ్యం ఏమిటో తేలనుంది.. మరోసారి వాయిదాపడిన నేపథ్యంలో అటు స్టూడెంట్స్.. ఇటు పేరెంట్స్‌లో ఆందోళన నెలకొంది. పరీక్షల నిర్వహణపై సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించనున్నారు. అలాగే కరోనా వ్యాప్తి నివారణ చర్యలు, లాక్డౌన్ అంశాలపై సోమవారం సాయంత్రం 4.30 గంటలకు సీఎం సమీక్ష నిర్వహిస్తారని అధికారులు తెలిపారు.
రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు మరోసారి వాయిదాపడ్డాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కరోనా పాజిటివ్ కేసులు పెద్దసంఖ్యలో వెలుగు చూస్తున్న నేపథ్యంలో జీహెచ్ఎంసీ, రంగారెడ్డి పరిధిలో టెన్త్ పరీక్షలను నిలిపివేయాలని హైకోర్టు శనివారం స్పష్టంచేసింది. అయితే, రాష్ట్రంలో మిగతా చోట్ల మాత్రం షెడ్యూల్‌కు అనుగుణంగా నిర్వహించుకోవచ్చని సూచించింది. హైకోర్టు నుంచి ఉత్తర్వులు వెలువడిన కొన్ని గంటల్లోనే పది పరీక్షలను రాష్ట్రవ్యాప్తంగా వాయిదా వేస్తూ సర్కారు నిర్ణయం తీసుకుంది.