సారథి న్యూస్, నర్సాపూర్: అడపాదడపా చినుకులు, అప్పుడప్పుడు భారీవర్షాలు కురవడంతో ఖరీఫ్ సీజన్ వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. రైతులు చేలల్లో కలుపుతీత పనులతో పాటు వరి నాట్లలో నిమగ్నమయ్యారు. నర్సాపూర్మండలంలో భౌగోళిక విస్తీర్ణం 22,496 ఎకరాలు ఉండగా, ఇందులో వ్యవసాయ భూమి 11,576 ఎకరాలు, సాగుకు వీలులేని భూమి 10,920 ఎకరాలు ఉంది. అందులో భాగంగానే సన్న చిన్న కారు రైతులు కౌడిపల్లి లో1700 , కొల్చారంలో 11057మంది ఉన్నారు. గతేడాది వరి 7,426 ఎకరాలు సాగు కాగా, పత్తి మూడువేల ఎకరాల మేర సాగుచేశారు. అవసరమైన ఎరువులు అందుబాటులో ఉన్నాయని అగ్రికల్చర్ అధికారులు చెబుతున్నారు. రైతుల అవసరాల మేరకు కౌడిపల్లి మండలానికి 422.72 మెట్రిక్ టన్నులు, కొల్చారం మండలానికి 3420.37 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం ఉందని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. సరిపడా వాటిని రెడీ చేశామని పేర్కొంటున్నారు.
వ్యవసాయ రంగానికి పెద్దపీట
రైతులు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వం అన్నిరకాల చర్యలు తీసుకుంటోంది. మెదక్ జిల్లాలో రూ.లక్షలోపు క్రాప్‌లోన్ ఉన్న 78వేల మంది రైతులకు లబ్ధి చేకూరింది. నియోజకవర్గ పరిధిలో సాగునీటి వనరులపై ఎమ్మెల్యే మదన్ రెడ్డి ప్రత్యేకదృష్టి పెట్టి కొల్చారం, కౌడిపల్లిలో నీటి నిల్వ కోసం నిర్మాణం చేపట్టాం. రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తున్నాం.
– రామాగౌడ్, రైతు సమన్వయ సమితి మండలాధ్యక్షుడు
ఎరువుల కొరత లేకుండా చూస్తాం
వానాకాలం పంటలకు ఎరువుల కొరత లేకుండా చూస్తాం. రైతులకు ఆయా సహకార సంఘాల్లో ఫర్టిలైజర్ దుకాణాల్లో ఎరువులను సిద్ధంగా ఉంచాం. సమాచారం కోసం వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించాలి. పంటల సాగుపై ఇప్పటికే వ్యవసాయ విస్తరణ అధికారులతో రైతు అవగాహన సదస్సులు నిర్వహించాం.
– పద్మావతి, ఏవో
- July 5, 2020
- Archive
- మెదక్
- లోకల్ న్యూస్
- COTTON
- NARSAPUR
- RICE
- నర్సాపూర్
- పత్తి
- వరి
- వరిసాగు
- Comments Off on జోరుగా పంటల సాగు