సారథి న్యూస్, జూరాల: ఎగువన కురుస్తున్న భారీవర్షాలకు కృష్ణానదికి ఒక్కసారిగా వరదనీరు పోటెత్తింది. జోగుళాంబ గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టు 43 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. 2009లో మాదిరిగానే భీకర వరద ప్రవాహం కొనసాగిందని స్థానికులు చెప్పారు. ఈ క్రమంలో బీచుపల్లి ఆలయం వద్ద పుష్కరఘాట్ మునిగింది. జూరాల సామర్థ్యం 8.730 టీఎంసీ నీటినిల్వ ఉంది. ఇన్ఫ్లో 4,06,000 క్యూసెక్కులు ఉండగా, ఔట్ప్లో 4,17,000 క్యూసెక్కులుగా నమోదైంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
- September 28, 2020
- Archive
- Top News
- మహబూబ్నగర్
- ముఖ్యమైన వార్తలు
- BECHUOALLY TEMPLE
- JURALA
- KRISHNA RIVER
- కృష్ణానది
- జూరాల
- బీచుపల్లి ఆలయం
- Comments Off on జూరాల 43 గేట్ల ఎత్తివేత