న్యూఢిల్లీ: కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ఇంటర్నేషనల్ ఫ్లైట్స్‌ను ఆపేసిన కేంద్ర ప్రభుత్వం ఆ నిషేధాన్ని ఈ నెల 31 వరకు పొడిగించింది. ఇంటర్నేషనల్ సర్వీసెస్‌పై బ్యాన్ కొనసాగిస్తున్నట్లు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే సెలెక్టెడ్ రూట్స్‌లో మాత్రం పరిస్థితిని బట్టి కొన్ని సర్వీసులు నడుపుతామని కేంద్ర విమానయాన శాఖ చెప్పింది. జూన్ 26న ఇచ్చిన సర్క్యూలర్‌ను మాడిఫై చేస్తూ తాజా ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నెల 15 వరకు ఫ్లైట్లపై నిషేధం ఉంటుందని గతంలో ఉత్తర్వులు జారీ చేశారు. కాగా.. డొమస్టిక్ సర్వీసులను ప్రారంభించిన కేంద్రం విదేశాల్లో చిక్కుకున్న మన వారిని తీసుకొచ్చేందుకు వందేభారత్ మిషన్ ప్రారంభించి ప్రత్యేక విమానాలు నడుపుతోంది. దీంట్లో భాగంగానే ఎయిర్ఇండియా ఇంటర్నేషనల్ ఫ్లైట్స్‌ను నడుపుతోంది. మే 6నుంచి వందేభారత్ ఫ్లైట్లు నడుస్తున్నాయి.
- July 3, 2020
- Archive
- Top News
- జాతీయం
- AEROPLANE
- DOMOSTIC
- INTERNATIONAL
- ఇంటర్నేషనల్
- డొమస్టిక్
- విమానాలు
- Comments Off on జులై 31 వరకు ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ బంద్