న్యూఢిల్లీ: లాక్డౌన్లో జీతాలు చెల్లించడంపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రైవేట్ కంపెనీలకు భారీ ఊరటనిచ్చింది. లాక్డౌన్ సమయంలో జీతాలు ఇవ్వని ప్రైవేటు కంపెనీలపై ఎలాంటి యాక్షన్ తీసుకోవద్దని కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది. జులై చివర వరకు ప్రైవేటు సంస్థలకు ఈ వెసులుబాటు కల్పిస్తున్నట్లు కోర్టు చెప్పింది. జస్టిస్‌లు అశోక్ భూషన్, సంజయ్ కిషన్ కౌల్, ఎంఆర్ పాషాలతో కూడిన బెంచ్ ఈ నిర్ణయాన్ని ప్రకటించింది ఎంప్లాయిస్, కంపెనీలతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు మీటింగ్ ఏర్పాటు చేసి ఈ సమస్యలను పరిష్కరించాలని కోర్టు ఆదేశించింది. ఎంప్లాయిస్ అందరికీ కచ్చితంగా ఫుల్ సాలరీ ఇవ్వాలని ఆదేశిస్తూ కేంద్ర హోంశాఖ ఇచ్చిన ఉత్తర్వులపై నాలుగు వారాల్లో రిప్లై ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
- June 12, 2020
- Archive
- షార్ట్ న్యూస్
- SALARIES
- SUPREMCOURT
- జీతాలు
- సుప్రంకోర్టు
- Comments Off on జీతాలివ్వని కంపెనీలపై యాక్షన్ వద్దు