Breaking News

జర్నలిస్టులందరికీ డబుల్ బెడ్​రూమ్ ​ఇళ్లు

జర్నలిస్టులందరికీ డబుల్ బెడ్​రూమ్​ఇళ్లు

సారథి న్యూస్, మహబూబ్​నగర్: ఉమ్మడి మహబూబ్​నగర్ ​జిల్లాలో అర్హులైన జర్నలిస్టులందరికీ డబుల్​బెడ్​రూమ్​ఇళ్లు ఇవ్వాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్​బండి విజయ్​కుమార్ ​రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం నిర్వహించిన జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. జర్నలిస్టుల మహాసభలను మార్చిలో నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. పటాన్​చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఓ జర్నలిస్టును చంపుతానని బెదిరించడం, అసభ్యకరంగా మాట్లాడడం జర్నలిస్టు సమాజాన్ని అవమానపర్చడమేనని అన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని హెచ్చరించారు. సదరు ఎమ్మెల్యేను వెంటనే అరెస్ట్ ​చేసి జైలుకు పంపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు. అంతకుముందు దివంగత జర్నలిస్టు హబిబ్ మృతికి నివాళులర్పించారు. రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. సమావేశంలో ఫెడరేషన్​ జిల్లా ఉపాధ్యక్షుడు ఎంవీ రమణ, ఉపాధ్యక్షుడు వాకిట అశోక్ కుమార్, జాయింట్ సెక్రటరీలు నరసింహ, సుకుమార్, జంగం దిలీప్ కుమార్, రవి, ఎన్.గోపాల్, జీఎస్.ప్రకాష్. వై.నరసింహులు, ఖాజామొయినుద్దీన్, హరిప్రసాద్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న బండి విజయ్​కుమార్​