న్యూఢిల్లీ: చైనా మరో షాక్ తగిలింది. ఇప్పటికే యాప్స్‌ను బ్యాన్ చేసిన ఇండియా కలర్ టీవీల దిగుమతులపై ఆంక్షలు విధించింది. టీవీలు దిగుమతి చేసుకునే వారు కచ్చితంగా ప్రభుత్వ పర్మిషన్ తీసుకోవాలని, లైసెన్స్ ఉన్న వాళ్లు మాత్రమే ఇంపోర్ట్ చేసుకోవాలని సూచించింది. దాన్ని రెస్ట్రిక్టెడ్ కేటగిరీలోకి తీసుకొచ్చినట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) స్టేట్మెంట్ ఇచ్చింది.
‘టీవీ ఇంపోర్ట్స్ ఇప్పుడు రెస్ట్రిక్టెడ్ కేటగిరీలోకి వస్తుంది. దిగుమతి చేసుకోవాలంటే లైసెన్స్ ఉండాల్సిందే. చైనా టీవీలకు చెక్ పెట్టేందుకే ఈ నిర్ణయం’ అని పేరు చెప్పేందుకు ఇష్టపడని ఒక అధికారి చెప్పారు. మన దేశంలో మొత్తం రూ.15వేల కోట్ల టీవీ ఇండస్ట్రీ ఉండగా.. దాంట్లో దాదాపు 36శాతం చైనా, సౌత్ ఈస్ట్ ఏషియా నుంచి ఇంపోర్ట్ అవుతాయని ఆయన అన్నారు. స్వదేశీ టీవీలను ఎంకరేజ్ చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఇండియా – చైనా బోర్డర్లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా మన ప్రభుత్వం 59 చైనా యాప్స్‌పై బ్యాన్ విధించింది. రెండో విడతలో భాగంగా మరో 45 యాప్స్‌ను కూడా బ్యాన్ చేసింది.