సారథి న్యూస్, రామగుండం: చిరుత పులి సంచరిస్తున్న నేపథ్యంలో పరిసర గ్రామాల ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని స్థానిక ఎమ్మెల్యే కోరుకంటి చందర్ సూచించారు. ఆదివారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో ఫారెస్ట్అధికారులతో ఎమ్మెల్యే సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వారం రోజులుగా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని జనగామ శివారులో చిరుత పులి సంచరిస్తోందని, శివారు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఒంటరిగా వెళ్లొద్దని సూచించారు. సమావేశంలో నగర మేయర్ అనిల్ కుమార్, అడవిశాఖ అధికారులు రవి ప్రసాద్, రహీంషాషా, అధికారులు పాల్గొన్నారు.
- January 3, 2021
- Archive
- కరీంనగర్
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- FOREST DEPARTMENT
- MLA KORUKANTI
- RAMAGUNDAM
- ఎమ్మెల్యే కోరుకంటి
- చిరుత సంచారం
- రామగుండం
- Comments Off on చిరుత సంచారం.. అలర్ట్గా ఉండాలె