Breaking News

చిన్నారులూ.. భళా

చిన్నారులూ.. భళా

సారథి న్యూస్, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ పట్టణానికి చెందిన చెందిన ఇద్దరు చిన్నారులు ఆదర్శంగా నిలిచారు. కరోనా మహమ్మారిపై ప్రభుత్వాలు చేస్తున్న పోరుకు తమవంతు సాయం అందించారు. తాము దాచుకున్న పాకెట్ మనీ రూ.2,009ను ‘సీఎం కేర్స్ ఫండ్‌’కు విరాళంగా ఇచ్చి తమలోని దాతృత్వ గుణాన్ని చాటుకున్నారు.

పట్టణానికి చెందిన ఎల్ఐసీ ఉద్యోగి కులకర్ణి పిల్లలు దేశ్ పాండే బాలార్క్ ఐదవ తరగతి, దేశ్పాండే శ్రీహార్ష్ స్థానిక ఓ ప్రైవేట్ స్కూలులో రెండవ తరగతి చదువుతున్నాడు. తాము దాచుకున్న రూ.2,009ను మంగళవారం నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ ఈ.శ్రీధర్ కు అందజేశారు.

తాము ఇచ్చిన డబ్బులను ఎప్పటికప్పుడు దాచుకునే వారని, కరోనా నేపథ్యంలో ప్రభుత్వానికి సాయం అందించేందుకు ముందుకొచ్చారని చిన్నారుల తండ్రి కులకర్ణి విలేకరులకు తెలిపారు. వారి స్ఫూర్తిని చూసి పలువురు అభినందించారు.