సారథి న్యూస్, హుస్నాబాద్: వర్షాలు కురవాలని గ్రామస్తులు, రైతులు బుధవారం మండలంలోని మాలపల్లిలో గ్రామదేవతలకు జలాభిషేకం చేశారు. సర్పంచ్ బత్తల మల్లయ్య మాట్లాడుతూ విత్తనాలు పెట్టి రోజులు దాటినా సరైన వర్షాలు కురవకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. జలాభిషేకం చేస్తే వరుణుడు కరుణించి వర్షాలు కురిపిస్తాడనే నమ్మకంతో పోచమ్మ, ఎల్లమ్మ, దుర్గమ్మ, మైసమ్మ, ఆంజనేయస్వామి విగ్రహాలకు జలాభిషేకం, ప్రత్యేక పూజలు చేశామని చెప్పారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్, వార్డుసభ్యులు, గ్రామస్తులు, మహిళలు పాల్గొన్నారు.