కాన్పూర్: ఎనిమిది మంది పోలీసులను పొట్టనబెట్టుకున్న గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబేను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ఈ క్రిమినల్ పోలీసులకు చిక్కాడు. వికాస్‌దూబే కోసం మూడు రాష్ట్రాల పోలీసులు తీవ్రంగా గాలించారు. గురువారం ఉదయం 8 గంటల ప్రాంతంలో వికాస్‌దూబే ఉజ్జయినీలోని ఆలయం సమీపంలో కనిపించాడు. గమనించిన ఓ దుకాణ యజమాని పోలీసులకు సమాచారమివ్వగా అక్కడికి చేరుకున్న పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. గత శుక్రవారం వికాస్‌దూబేను అరెస్ట్ చేసేందుకు వెళ్లిన ఎనిమిది పోలీసులను అతడి అనుచరులు కాల్చిపంపిన విషయం తెలిసిందే. వికాస్ దూబేపై ప్రస్తుతం రూ. 5 లక్షల రివార్డు ఉంది. ఇప్పటికే వికాస్ దూబేకు చెందిన ఇద్దరు అనుచరులు పోలీసులు ఎన్కౌంటర్లో చనిపోయిన విషయం తెలిసిందే..
- July 9, 2020
- Archive
- Top News
- క్రైమ్
- జాతీయం
- AREST
- THURSDAY
- UP POILICE
- VIKASDUBE
- గ్యాంగ్‌స్టర్
- వికాస్ దూబే
- Comments Off on గ్యాంగ్‌స్టర్ వికాస్‌దూబే అరెస్ట్