Breaking News

కొవ్వొత్తులతో నివాళి



సారథి న్యూస్​, ఎల్బీనగర్: భారత్, చైనా సైనికుల ఘర్షణలో అమరుడైన కల్నాల్ సంతోష్ బాబు, ఇతర అమర సైనికులకు బీజేపీ మన్సురాబాద్ డివిజన్ ప్రధాన కార్యదర్శి వలిశెట్టి మహేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం సహారా ఎస్టేట్ చౌరస్తాలోని వివేకానంద విగ్రహం వద్ద నివాళులర్పించారు. కార్యక్రమంలో కడారి యాదగిరి యాదవ్, మన్సురాబాద్ డివిజన్ మాజీ అధ్యక్షుడు పాతూరి శ్రీధర్ గౌడ్, బీజేవైఎం స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ దేవరకొండ లింగాచారి, వేణు గౌడ్, బీజేవైఎం మన్సురాబాద్ డివిజన్ సంద మౌని సురేష్ యాదవ్, పోచబోయిన నరేష్ యాదవ్, సంపత్, విష్ణు, శివరాంరెడ్డి పాల్గొన్నారు.