సారథి న్యూస్, రామగుండం: తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఎందరో అమరుల ఆత్మబలిదానాలు, ఉద్యమనేతల అలుపెరగని పోరాటంతో పాటు సీఎం కేసీఆర్ ఆమరణ దీక్ష ఫలితంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, అన్నివర్గాల సంక్షేమంతో పాటు కులవృత్తులకు ప్రోత్సాహం అందిస్తున్నారని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. ఆదివారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో మత్స్యకార సహకార సంఘాల సమావేశంలో మాట్లాడారు. సీఎం గొప్ప ఆలోచనలతో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మత్స్యకారులకు ఉపాధి అవకాశాలు పెరిగాయని అన్నారు. రామగుండం ప్రాంతంలోని గోదావరి నదిలో 12లక్షల చేపపిల్లలు, 12లక్షల రొయ్య పిల్లలను పెంచినట్లు తెలిపారు. రామగుండం నియోజవర్గంలోని మత్స్యకారులకు 92 వలలతో పాటు 25 లగేజీ ఆటోలు, 174 మోపెడ్స్, 9 సంచార చేపల వాహనాలను అందించామని తెలిపారు. కార్యక్రమంలో డీఎఫ్వో మల్లేశం, కోఆప్షన్ సభ్యులు వంగ శ్రీనివాస్ గౌడ్, సర్పంచ్ ధర్మాజి కృష్ణ, తానిపర్తి గోపాల్ రావు పాల్గొన్నారు.
- October 11, 2020
- Archive
- కరీంనగర్
- లోకల్ న్యూస్
- CM KCR
- MLA KORUKANTI
- RAMAGUNDAM
- ఎమ్మెల్యే
- కోరుకంటి చందర్
- రామగుండం
- సీఎం కేసీఆర్
- Comments Off on కులవృత్తులకు ప్రత్యేక ప్రోత్సాహం