సారథిన్యూస్, పాల్వంచ: కిన్నెరసాని రిజర్వాయర్లోకి భారీగా వరదనీరు వస్తున్నదని కేటీపీఎస్ 5,6 దశల సీఈ రవీంద్రకుమార్ తెలిపారు. మంగళవారం రాత్రి గేట్లు ఎత్తి ఐదువేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తామని చెప్పారు. కిన్నెరసాని పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, గేట్లు తెరిచిన సమయంలో కిన్నెరసాని వాగులో ఎలాంటి రాకపోకలు చేయవద్దని హెచ్చరించారు. కిన్నెరసాని రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టం 8.4 టీఎంసీలు కాగా ప్రస్తుతం 7.495 టీఎంసీల నీరు ఉన్నది. 10 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతున్నది.
- July 15, 2020
- Archive
- ఖమ్మం
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- INFLOW
- KINNERASANI
- KTPS
- PALWANCHA
- WATER
- కిన్నెరసాని
- రిజర్వాయర్
- Comments Off on కిన్నెరసానికి భారీ వరద