సారథి న్యూస్, శ్రీకాకుళం: దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం కార్మికవర్గంపై జరుపుతున్న తీవ్రమైన దాడికి నిరసనగా 11 అఖిలపక్ష కార్మిక సంఘాలు పిలుపు మేరకు సీఐటీయూ ఆధ్వర్యంలో పాలకొండలో బుధవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి దావాల రమణారావు మాట్లాడుతూ.. మోడీ ప్రభుత్వం కరోనాను అవకాశంగా తీసుకుని కార్మికవర్గంపై ముప్పేట దాడి కొనసాగిస్తోందన్నారు. కేంద్రప్రభుత్వ విధానాల కారణంగా కార్మికులు నేడు పస్తులు ఉండాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు. కార్మికులకు నెలకు రూ.7,500తో పాటు 10 కేజీల బియ్యం, నిత్యావసర సరుకులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మోడీ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పి.భాస్కర్ రావు, పి.వేణు, పి.శ్రీను, పి.శ్రీదేవి, వి.ఆంజనేయులు, ఎన్.సాయి పాల్గొన్నారు.
- September 23, 2020
- Archive
- లోకల్ న్యూస్
- శ్రీకాకుళం
- CITU
- CPM
- NARENDRAMODI
- ప్రధాని నరేంద్రమోడీ
- సీఐటీయూ
- సీపీఎం
- Comments Off on కార్మికవర్గాన్ని ఆదుకోవాలి