సారథిన్యూస్, కొత్తగూడెం: సింగరేణిలో ఎక్స్ ప్లోరేషన్ విభాగంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు, ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం కొత్తగూడెంలో కాంట్రాక్ట్ కార్మికులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో నాయకులు మాట్లాడుతూ.. సింగరేణి సంస్థలోనే ప్రత్యామ్నాయ పనులలో వీరికి అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు పీ ప్రమోద్, ఎన్ సూర్య, భద్రం, నిజాముద్దీన్, వెంకటేశ్వర్లు, చంద్రశేఖర్, సంపత్, సమ్మయ్య, రమేశ్, తదితరులు పాల్గొన్నారు.
- June 22, 2020
- Archive
- ఖమ్మం
- లోకల్ న్యూస్
- CITU
- KOTHAGUDEM
- LABOUR
- SINGHARENI
- ఆందోళన
- సింగరేణి
- Comments Off on కాంట్రాక్ట్ కార్మికులను ఆదుకోండి