సారథి న్యూస్, బెజ్జంకి: రహదారులపై కల్వర్టులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని యువజన కాంగ్రెస్ నేత పోతిరెడ్డి రాజశేఖర్రెడ్డి ఆరోపించారు. వర్షాకాలంలో కురిసిన భారీవర్షాలకు వాగులు, ఒర్రెలు పొంగి పొర్లుతున్నాయన్నారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల పరిధిలోని తాళ్లపల్లి, గూడెం, వడ్లూర్, బేగంపేట్, లక్ష్మీపూర్, ఎల్లంపల్లి, తలారివానిపల్లి గ్రామాలకు వెళ్లేదారుల్లో కల్వర్టులు లేక రాత్రివేళల్లో ప్రజలు అనేక రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారన్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు స్పందించి కల్వర్టులు నిర్మించాలని డిమాండ్ చేశారు.