Breaking News

కరోనావేళ విందులు, చిందులు

తిరువ‌నంత‌పురం: ఓ వైపు కరోనా మహమ్మారి దేశాన్ని కుదిపేస్తుంటే.. కొందరేమో నిబంధనలు గాలికి వదిలేసి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల కేరళలోని ఓ రిసార్ట్​లో జరిగిన విందులో సుమారు 300 మంది పాల్గొన్నట్టు సమాచారం. అనంతరం ఆ వీడియోలను సోషల్​మీడియాలో షేర్​ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కేర‌ళ‌లోని హిల్లీ జిల్లా ఉదుంబంచోలలో ఈ ఘటన చోటుచేసుకున్నది. రిసార్టు మేనేజ‌ర్ స‌హా ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ ప్రైవేట్ కంపెనీ ప్రారంభోత్సవం సందర్భంగా జూన్ 29న ఈ వేడుక నిర్వహించారు. ఈ పార్టీకోసం బెంగుళూరు, ఎర్నాకులం, ఉక్రేయిన్ నుంచి డ్యాన్స‌ర్ల‌ని రప్పించిన‌ట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కావ‌డంతో వీరిపై కేసు న‌మోదైంది. కరోనావేళ చదువుకున్న యువత సైతం ఇలా ప్రవర్తించడం సరికాదని పలువురు పేర్కొంటున్నారు.