సారథి న్యూస్, ఎల్బీనగర్ (హైదరాబాద్): కరోనా నుంచి ప్రజలను కాపాడడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని టీడీపీ ఎల్బీనగర్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఎస్వీ క్రిష్ణప్రసాద్ విమర్శించారు. సోమవారం ఎల్బీనగర్ మున్సిపాలిటీ జోనల్ కమిషనర్ ఆఫీసు ఎదుట పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి ధర్నాచేపట్టారు. ముఖ్యఅతిథిగా టీడీపీ మల్కాజిగిరి పార్లమెంట్ అధ్యక్షుడు కందికంటి అశోక్ కుమార్ గౌడ్ హాజరయ్యారు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చి ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని ఆయన డిమాండ్ చేశారు. మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో పేద, మధ్యతరగతి ప్రజలు ఆర్థికంగా చితికిపోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. కార్యక్రమంలో నాయకులు వెంకట్, గాంధీ, మహేందర్ గౌడ్, ప్రవీణ్ గౌడ్, శ్రీశైలం గౌడ్, టీఎన్ఎస్ఎఫ్ స్టేట్ కోఆర్డినేటర్ రమాకాంత్ గౌడ్, టీఎస్ఎన్వీ మల్కాజిగిరి పార్లమెంట్ అధ్యక్షుడు మెల్లం శ్రీనివాస్ రావు, టీఎన్టీయూసీ మల్కాజిగిరి పార్లమెంట్ అధ్యక్షుడు ప్రసాద్ బాబాయ్, సునీల్, సుభాన్, సంజీవ్ రెడ్డి, అరవింద్ రెడ్డి, నవీన్ గౌడ్, క్రిష్ణవేణి పాల్గొన్నారు.
- August 17, 2020
- Archive
- లోకల్ న్యూస్
- హైదరాబాద్
- AROGYASREE
- KARONA
- LBNAGAR
- TDP
- ఆరోగ్యశ్రీ
- ఎల్బీ నగర్
- కరోనా
- టీడీపీ
- Comments Off on కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలి