Breaking News

కరోనా కట్టడికి ఏంచేద్దాం?

కరోనా కట్టడికి ఏంచేద్దాం?

సారథి న్యూస్, రామగుండం: కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్​ అధికారులతో సమీక్షించారు. జిల్లాలో శానిటైజేషన్​ విధిగా చేయాలని.. కరోనా పేషెంట్లు క్వారంటైన్​లో ఉండేలా చూసుకోవాలని అధికారులకు సూచించారు. సోమవారం పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్​లో ఆయన కలెక్టర్​, అధికారులతో సమావేశమయ్యారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత, జడ్పీచైర్మన్ పుట్ట మధుకర్, ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, ఎమ్మెల్సీ భాను ప్రసాద్ రావు, ఇంచార్జి కలెక్టర్ భారతి హోళికేరి, అదనపు కలెక్టర్లు కుమార్ దీపక్, లక్ష్మీ నారాయణ పాల్గొన్నారు.

ఎంపీడీవో కార్యాలయం ప్రారంభం
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలకేంద్రంలో రూ. కోటి అంచనా వ్యయంతో నిర్మించిన ఎంపీడీవో ఆఫీసును మంత్రి ప్రారంభించారు.