![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/06/ramesh.jpeg?fit=853%2C1280&ssl=1)
సారథి న్యూస్, వనపర్తి: రోజురోజుకూ రకరకాల వ్యాధులు పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రతి పోలీస్స్టేషన్ పరిధిలో ఒక్కో గ్రామాన్ని దత్తత తీసుకుని పారిశుద్ధ్యం, అనారోగ్య సమస్యలు తదితర వాటిపై అవగాహన కల్పించాలని పోలీసుశాఖ అధికారులు, సిబ్బందికి వనపర్తి జిల్లా ఎస్పీ అపూర్వరావు సూచించారు. బుధవారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. సీజనల్ వ్యాధుల బారినపడకుండా వృద్ధులు, చిన్నారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అనారోగ్య సమస్యలు ఉన్నవారు బయట తిరగొద్దని సూచించారు. వనపర్తి సీఐ సూర్యనాయక్, వనపర్తి తహసీల్దార్ రాజేందర్ గౌడ్, గోపాల్ పేట ఎస్సై రామన్ గౌడ్, వనపర్తి రూరల్ ఎస్సై షేక్ షఫీ, గోపాలపేట్ ఎంపీపీ సంధ్య పాల్గొన్నారు.