బెంగళూరు: కర్ణాటక సీఎం యడ్యూరప్ప హోంఐసోలేషన్లోకి వెళ్లిపోయారు. ఇటీవల ఆయన కార్యాలయంలోని పలువురు సిబ్బందికి కరోనా పాజిటివ్ రావడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ‘నా కార్యాలయంలోని కొంతమందికి కరోనా పాజిటివ్ రావడంతో నేను హోం ఐసోలేషన్లోకి వెళుతున్నాను. ప్రస్తుతం నా ఆరోగ్యం బాగానే ఉంది ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’ అని ఆయన పేర్కొన్నారు. ఇక నుంచి తాను అధికారిక నివాసం ‘కావేరి’ నుంచి పనిచేస్తానని… వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులకు తగిన సూచనలు సలహాలు ఇస్తానని పేర్కొన్నారు.
- July 11, 2020
- Archive
- జాతీయం
- CARONA
- CM
- HOME ISOLATION
- KARNATAKA
- యడ్యూరప్ప
- హోం ఐసోలేషన్
- Comments Off on ఐసోలేషన్లో కర్ణాటక సీఎం