Breaking News

ఐసీఎస్‌ఈ ఫలితాలు వెల్లడి

ఐసీఎస్‌ఈ ఫలితాలు వెల్లడి


న్యూఢిల్లీ: ఐసీఎస్‌ఈ 10 , 12 తరగతుల రిజల్ట్స్‌ శుక్రవారం విడుదలయ్యాయి. ఐసీఎస్‌ఈ ఈ ఫిలితాలను రిలీజ్‌ చేసింది. పదోతరగతిలో 99.33 శాతం మంది స్టూడెంట్స్‌ పాస్‌అయ్యారు. 12వ తరగతిలో 96.84 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాదించారు. ఫలితాలను తమ వెబ్‌సైట్‌లో చూసుకోవాలని అధికారులు ప్రకటించారు. ఎస్‌ఎమ్‌ఎస్‌ ద్వారా కూడా రిజల్ట్‌ పొందవచ్చని అన్నారు. పోయిన ఏడాది పాస్‌ పర్సెంట్‌ 98.54శాతం కాగా.. ఐఎస్‌సీ ఎగ్జామినేషన్‌లో 96.52శాతం పాస్‌ అయ్యారు. కొన్ని కారణాల దృష్ట్యా మెరిట్‌ లిస్ట్‌ రిలీజ్‌ చేయడం లేదని అధికారులు చెప్పారు. వాయిదా పడ్డ పరీక్షలకు ఇంటర్నల్‌ అసెస్‌మెంట్‌ బేస్‌తో మార్కులు కేటాయించారు. రిజల్ట్‌ వచ్చిన 48 గంటల తర్వాత స్టూడెంట్స్‌ డిజిటిల్‌ మార్క్‌ లిస్ట్‌ పొందొచ్చు.
వెబ్‌సైట్స్‌:
https://cisce.org/ http://results.cisce.org/