సారథిన్యూస్, చేవెళ్ల: భూ వివాదంలో లంచం తీసుకుంటూ ఓ సీఐ ఏసీబీకి చిక్కాడు. రంగారెడ్డి జిల్లా షాబాద్ సీఐ శంకరయ్య ఓ వ్యక్తికి సంబంధించిన భూ వివాదాన్ని పరిష్కరించేందుకు రూ. లక్ష 20వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో సదరు వ్యక్తి ఏసీబీని ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు గురువారం షాబాద్ పీఎస్‌లో శంకరయ్య యాదవ్, ఏఎస్సై రాజేందర్.. బాధితుడి నుంచి లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సీఐ శంకరయ్యపై గతంలోనూ అవినీతి కేసులున్నాయి. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో పనిచేసినప్పడు అవినీతి ఆరోపణలు రావడంతో అతడిని సైబరాబాద్ కమిషనరేట్ కార్యాలయానికి అటాచ్ చేశారు. అనంతరం ఇటీవలే షాబాద్‌కు సీఐగా పంపించారు. అయినప్పటికీ ఈ ఖాకీ బుద్ధి మారలేదు.
- July 9, 2020
- Archive
- క్రైమ్
- రంగారెడ్డి
- లోకల్ న్యూస్
- ACB
- CI
- RANGAREDDY
- SI
- ఏసీబీ
- లంచం
- Comments Off on ఏసీబీకి చిక్కిన సీఐ