సారథి న్యూస్, ఎల్బీనగర్ : రంగారెడ్డి జిల్లా పెద్దఅంబర్ పేట్ మున్సిపాలిటీ కమిషనర్ ఎల్.రవీందర్ రావు లంచం తీసుకుంటుండగా మంగళవారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఏసీబీ డీసీపీ సూర్యానారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దఅంబర్ పేట్ మున్సిపాలిటీలోని కుంట్లూరు గ్రామానికి చెందిన సురభి వెంకట్ రెడ్డి నూతనంగా ఇంటి నిర్మాణం చేపడుతున్నాడు. నిర్మాణ అనుమతుల విషయంలో కమిషనర్ రవీందర్ రావు బాధితుడు వెంకట్ రెడ్డిని రూ1.5 లక్షలు డిమాండ్ చేయగా అవినీతి నిరోధకశాఖ అధికారులను ఆశ్రయించాడు. మంగళవారం సాయంత్రం పెద్దఅంబర్ పేటలోని మున్సిపల్ కమిషనర్ ఆఫీసులో కమిషనర్ రవీందర్ రావు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు.
- June 9, 2020
- Archive
- షార్ట్ న్యూస్
- హైదరాబాద్
- Comments Off on ఏసీబీ వలలో పెద్దఅంబర్ పేట్ కమిషనర్