సారథి న్యూస్, కర్నూలు: సచివాలయ ఉద్యోగాలకు ప్రిపేరవుతున్న అభ్యర్థులకు ఉచిత కోచింగ్ ఇచ్చేందుకు పుస్తకాలు ఇవ్వడం అభినందనీయమని రాష్ట్ర మున్సిపల్‌శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డిని ప్రశంసించారు. శుక్రవారం విజయవాడలో ఎస్వీ మోహన్ రెడ్డి మంత్రిని మర్యాదపూర్వంగా కలిశారు. ఈ సందర్భంగా ఆన్లైన్ గ్రాండ్ టెస్ట్–1 ప్రశ్నపత్రాన్ని మంత్రి చేతులమీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగాలకు ప్రిపేరయ్యే అభ్యర్థులకు ఆన్లైన్ క్లాసెస్ నిర్వహించడమే కాకుండా గ్రాండ్ టెస్టులు రాయించడం ప్రశంసనీయమన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. తమ సంస్థ ద్వారా 2018–19లో కోచింగ్ ఇప్పించామని, దాదాపు 400 మందికి ఉద్యోగాలు రావడం తనకు ఆనందంగా ఉందన్నారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల అభ్యర్థులు తమ కోఆర్డినేటర్వైవీ శివయ్య(7995132604)ను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో కర్నూలు జిల్లా మైనారిటీ నాయకులు షరీఫ్, బాషా మహమ్మద్ పాల్గొన్నారు.
- September 4, 2020
- Archive
- కర్నూలు
- లోకల్ న్యూస్
- BOTHSA SATYANARAYANA
- Kurnool
- ONLINETEST
- SV MOHANREDDY
- ఎస్వీ మోహన్‌రెడ్డి
- కర్నూలు
- బొత్స సత్యనారాయణ
- Comments Off on ఎస్వీ సేవ.. అభినందనీయం