న్యూఢిల్లీ: బ్యాటింగ్‌లో ఎవరు ఎలా ఆడినా జట్టు అవసరాల మేరకే ఫైనల్ ఎలెవన్‌లో చోటు ఉంటుందని కేరళ బ్యాట్స్‌మెన్, వికెట్ కీపర్ సంజూ శాంసన్ అన్నాడు. రిషబ్ పంత్‌తో తనకు ఎలాంటి పోటీలేదన్నాడు. తమ ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉందని, ఇది చాలారోజుల నుంచి కొనసాగుతుందన్నాడు. ‘2015లో నేను జింబాబ్వేపై అరంగేట్రం చేశాను. ఆ తర్వాత ఐదేళ్లు ఐపీఎల్, దేశవాళీ క్రికెట్ ఆడడం నాకు బాగా కలిసొచ్చింది. ఈ సమయంలో కెరీర్‌కు అవసరమైన పునాదులు వేసుకున్నా. నా ఆటను క్రమంగా మార్చుకున్నా.
మానసికంగా చాలా బలమైన వ్యక్తిగా తయారయ్యా. నా బలం, బలహీనతలనూ గుర్తించా. అంతర్జాతీయ ప్రమాణాలకు సరితూగే స్థాయిలో నేను నా ఆటను మల్చుకున్నా’ అని శాంసన్ పేర్కొన్నాడు. పంత్.. తను ఎప్పుడూ పోటీకాదన్నాడు. ఇద్దరం కలిసి చాలా మంచి ఇన్నింగ్స్‌లు ఆడామన్నాడు. కలిసి ఆడడాన్ని ఇద్దరం బాగా ఆస్వాదిస్తామని శాంసన్ వెల్లడించాడు.