సారథి న్యూస్, రామగుండం: ఎల్ఆర్ఎస్ ను రద్దుచేయాలని హైకోర్టు న్యాయమూర్తికి సీపీఐ ఆధ్వర్యంలో గురువారం పోస్టు ద్వారా లేఖలు పంపించారు. ఈ సందర్భంగా సీపీఐ నగర కార్యదర్శి కె.కనకరాజు, సహాయ కార్యదర్శి మద్దెల దినేష్, జి గోవర్ధన్ మాట్లాడుతూ.. ఆర్ఎస్ఎస్ తో సామాన్య ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతున్నారని ఆరోపించారు. పేదప్రజల నుంచి ఎల్ఆర్ఎస్ పేరుతో తెలంగాణ ప్రభుత్వం ఖజానా నింపుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తుందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వెంటనే ఆర్ఎస్ఎస్ చట్టాన్ని రద్దుచేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు ఎల్లాగౌడ్, టి.మల్లయ్య, కే.రాజారత్నం, టి.రమేష్ కుమార్, బి. భాస్కర్, అవినాష్ పాల్గొన్నారు.
- October 15, 2020
- Archive
- కరీంనగర్
- లోకల్ న్యూస్
- CM KCR
- CPI
- HIGHCOURT
- TELANGANA
- ఎల్ఆర్ఎస్
- తెలంగాణ
- సీఎం కేసీఆర్
- సీపీఐ
- హైకోర్టు
- Comments Off on ఎల్ఆర్ఎస్ ను రద్దుచేయండి