![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/06/rashan-23.jpg?fit=800%2C1200&ssl=1)
కన్నడ ముద్దుగుమ్మ రష్మిక మందన్న తిన్నగా ఉండకుండా రీసెంట్గా సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌ను ఉద్దేశించి ‘మీరు నా నుంచి ఎలాంటి సినిమాలు ఆశిస్తున్నారు.. మీరెలాంటి సినిమాలు చేయమంటే నేను అలాంటివి చేసేందుకు ట్రై చేస్తాను..’ అంటూ ఓ అప్రోచింగ్ పోస్ట్ పెట్టింది. దాంతో ఆమె ఫ్యాన్స్ అంటే ఆమె ఫాలోవర్సే ఎక్కువ స్పందించి రష్మికకు రీట్వీట్లు ప్రారంభించారు. మీరు అడుగుతున్న విషయం బాగానే ఉంది కానీ నువ్వు సినిమాల్లో నటించకుండా ఉండడమే మంచిదని కొందరు..
హార్రర్ సినిమాల్లో నటిస్తే నువ్వింకా బాగుంటావని కొందరు ఆకతాయిలు పెట్టిన పోస్టులు ఫన్నీగా అనిపించాయి. మరికొందరైతే చేసే సినిమాలు కాస్త అతి తగ్గించి చెయ్యి అని సూటిగానే చెప్పేశారు. పాపం పాప హర్టయ్యిందో.. జుట్టు పీక్కుందో తెలీదు కానీ వాటికి సమాధానం అయితే లేదు. ప్రస్తుతం రష్మిక అల్లు అర్జున్‌కు జోడీగా ‘పుష్ప’ సినిమాలో చేస్తోంది.