సారథి న్యూస్, సత్తుపల్లి : కరోనా విపత్తువేళ.. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య గొప్పమనసు చాటుకున్నారు. తన నియోజకవర్గంలో కరోనాతో బాధపడుతున్న రోగులకు తనవంతుగా రూ.500 ఆర్థికసాయం, కూరగాయలు, నిత్యవసరాలు అందజేశారు. ( 5 కిలోల బియ్యం, కిలో కందిపప్పు, కేజీ మంచినూనె, ఉల్లిపాయలు, ఉప్మారవ్వ, కారం, పసుపు, ఉప్పు, పంచదార, సబ్బులు, కూరగాయలు, 30 కోడిగుడ్లు) కరోనా వ్యాధిసోకిన నిరుపేద కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు పడకూడదనే సాయం చేసినట్టు చెప్పారు. కరోనా పట్ల ఎవరూ ఆందోళన చెందవద్దని.. సరైన వైద్యం తీసుకుంటే వ్యాధి నయమవుతుందని చెప్పారు. తన నియోజకవర్గంలో ఎంతమంది కరోనా బారినపడ్డా వారికి ఈ సాయం చేస్తానని చెప్పారు.
- September 5, 2020
- Archive
- ఖమ్మం
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- CARONA
- KAMMAM
- MLA
- PATIENTS
- VEERAIAH
- నిత్యవసరాలు
- పంపిణీ
- రోగులు
- సత్తుపల్లి
- Comments Off on ఎమ్మెల్యే వెంకటవీరయ్య .. గొప్పమనసు