‘ఇది స్క్రిప్ట్ కాదు.. నా లైఫ్ స్టోరీ. ప్రతి అమ్మాయి లైఫ్ స్టోరీ’ అంటోంది తేజస్వి మాదివాడ. తెలుగమ్మాయిగా ఇండస్ట్రీకి వచ్చి చాలా కష్టాలు పడ్డాను. తెలుగమ్మాయి కాబట్టి కమిట్మెంట్అడగడం కూడా ఈజీ. డైరెక్ట్ గా అడిగేవాళ్లు. చాలామంది పెద్ద డైరెక్టర్స్ తో వర్క్ చేశాను. చాలాచోట్ల అన్ కంఫర్టబుల్ గా ఫీలయ్యాను. కానీ అదెప్పుడు జనాలకు చెప్పే ఛాన్స్ రాలేదు. కానీ దేవుడు ఈ సినిమా రూపంలో ఆ ఛాన్స్ ఇచ్చాడు. ఈరోజు నేను ఈ స్థానంలో ఉండడానికి ఎంత ఫైట్ చేశాననేది ఈ సినిమా కథ. కమిట్మెంట్, సెక్స్, ఎక్స్ పోజింగ్ గురించిన సినిమా కాదిది. రియల్ స్టోరీ. దీనిని డర్టీ మూవీలా కాకుండా ఇన్ఫర్మేటివ్మూవీలా చూడాలి’ అంటూ ‘కమిట్మెంట్’ సినిమా గురించి చెప్పింది తేజస్వీ మాదివాడ. లక్ష్మీకాంత్ చెన్నా రూపొందించిన ఈ సినిమాకు బలదేవ్ సింగ్, నీలిమ నిర్మాతలు. అమిత్ తివారి, శ్రీనాథ్ మాగంటి, అన్వేషి జైన్, తనిష్క్ రాజన్, అభయ్ రెడ్డి, సూర్య శ్రీనివాస్, రమ్య పసుపులేటి, సిమర్ ఇందులో ప్రధానపాత్రలు పోషించారు. ప్రసాద్ ల్యాబ్స్ లో ఈ మూవీ టీజర్ లాంచ్ జరిగింది. ‘లవ్, హోప్, డ్రీమ్, ఫైట్ అనే నాలుగు కథల ఆంథాలజీ ఇది. ‘పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. వీలైతే థియేటర్స్ లో లేదంటే ఓటీటీలో రిలీజ్ చేస్తాం’ అని నిర్మాతలు చెప్పారు.
- November 18, 2020
- Archive
- సినిమా
- BALDEVSINGH
- DREAM
- LOVE
- NILIMA
- TEJASWI MADIWADA
- డ్రీమ్
- తేజస్వి మాదివాడ
- నీలిమ
- ఫైట్
- బలదేవ్ సింగ్
- లవ్
- హోప్
- Comments Off on ఎక్స్పోజింగ్ మూవీ కాదు