సారథి న్యూస్, రామగుండం: తెలంగాణ అడపడుచులు ఇంటింటా ఉత్సాహంగా జరుపుకునే బతుకమ్మ పండుగకు పెద్దన్నగా, మేనమామ, తండ్రిగా సీఎం కేసీఆర్ గారు చీరెలను అందిస్తున్నారని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. శుక్రవారం కార్పొరేషన్ పరిధిలోని 6వ డివిజన్ లో మేయర్ బంగి అనిల్ కుమార్ తో కలిసి బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు రూ.317 కోట్లు ఖర్చుచేసి కోటి మంది మహిళలకు ప్రభుత్వం బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తుందన్నారు. 287కు పైగా డిజైన్ల చీరలు అందుబాటులో ఉన్నాయని ఆయన వివరించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఉదయ్ కుమార్, డిప్యూటీ తహసీల్దార్ సురేష్ కార్పొరేటర్ కాల్వ స్వరూప శ్రీనివాస్, కోఆప్షన్ సభ్యులు తస్లీమా, భాను పాల్గొన్నారు.
- October 9, 2020
- కరీంనగర్
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- BATHUKAMMA
- MLA KORUKANTI
- RAMAGUNDAM
- TELANGANA
- ఎమ్మెల్యే కోరుకంటి
- తెలంగాణ
- బతుకమ్మ
- రామగుండం
- Comments Off on ఇంటింటా సంతోషంగా నిండాలని..