Breaking News

‘ఆహా’లోకి మరో యంగ్​ డైరెక్టర్​

కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో ఇక థియేటర్లు తెరిచే చాన్స్​ లేకపోవడంతో యువదర్శకులంతా డిజిటల్​ ఫ్లాట్​ఫామ్​ల వైపు పరుగులు తీస్తున్నారు. తాజాగా ఆ జాబితాలోకి యువ దర్శకుడు అనిల్​ రావిపూడి చేరిపోయారు. అల్లు అరవింద్​ ప్రారంభించిన డిజిటల్​ యాప్​ ఆహా కోసం అనిల్​ రావిపూడి ఓ కామెడీ వెబ్​సీరిస్​ను తెరకెక్కించబోతున్నాడని ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కొత్తనటీనటులతో ఈ వెబ్​సీరిస్​ను ప్లాన్​ చేయబోతున్నట్టు సమాచారం. మ‌రో ప‌క్క అనీల్ ‘ఎఫ్‌3’ స్క్రిప్ట్‌ను సిద్ధం చేసుకున్నాడు. క‌రోనా ప్ర‌భావం త‌గ్గిన త‌ర్వాత ఈ సినిమా షూటింగ్​ ప్రారంభించే అవకాశం ఉన్నది.