Breaking News

ఆలయంలోనే బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం

సారథి న్యూస్​, హైదరాబాద్​: కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో ఈనెల 23న బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణ మహోత్సవాన్ని ఆలయం వేదపండితుల సమీక్షంలోనే జరిపించాలని నిర్ణయించినట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు. శనివారం దేవాదాయ, జీహెచ్​ఎంసీ, పోలీసుశాఖ అధికారులతో సమీక్షించారు. భక్తులు వేల సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున.. కరోనా వ్యాప్తి చెందకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. దేవాదాయశాఖ కమిషనర్ అనిల్ కుమార్, కార్పొరేటర్లు శేషుకుమారి, కొలాన్ లక్ష్మి, సెంట్రల్ జోన్ జోనల్ కమిషనర్ ప్రావీణ్య, పంజాగుట్ట ఏసీపీ తిరుపతి పాల్గొన్నారు.