న్యూయార్క్: మాజీ నంబర్ వన్.. ఐదుసార్లు వింబుల్డన్ చాంపియన్.. రెండుసార్లు యూఎస్ ఓపెన్ టైటిల్ సొంతం చేసుకున్నా.. తన కల ఇంకా తీరలేదంటోంది అమెరికా నల్ల కలువ వీనస్ విలియమ్స్. కెరీర్ ముగిసేలోగా ఫ్రెంచ్, ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలవాలని కోరుకుంటోంది. బుధవారం 40వ పడిలోకి అడుగుపెడుతున్న వీనస్.. ఈ రెండు గ్రాండ్‌స్లామ్ లు గెలవడం తన కల అని చెబుతోంది. ‘మనకంటూ కొన్ని కలలు ఉండాలి. వాటిని నెరవేర్చుకునేందుకు ఎంతకైనా శ్రమించాలి. వయసు దీనికి అడ్డంకి కాకూడదు. ఫ్రెంచ్, ఆస్ట్రేలియా ఓపెన్‌ను నేను గెలవలేకపోయా. ఇది దురదృష్టమే అనుకుంటా. అందుకే ఈ ఏడాది అవకాశం వస్తే ఈ రెండు టైటిల్స్‌ను గెలిచేందుకు ప్రయత్నిస్తా’ అని వీనస్ వ్యాఖ్యానించింది.
- June 17, 2020
- Archive
- Top News
- క్రీడలు
- AUSRTALIA
- FRENCH
- OPEN
- వింబుల్డన్
- వీనస్ విలియమ్స్
- Comments Off on ఆ గ్రాండ్‌స్లామ్ లు గెలవడం నా కల