- మంత్రి హరీశ్‌రావు
సారథి న్యూస్, సంగారెడ్డి: తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఆత్మగౌరవంతో బతకాలనే నియంత్రత వ్యవసాయ విధానాన్ని అమలుచేస్తున్నామని మంత్రి హరీశ్ రావు ప్రకటించారు. శనివారం ఆయన సాగు విధానంపై సంగారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించిన అవగాహన సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వానాకాలంలో రైతుబంధు కింద ఇచ్చేందుకు ఇప్పటికే రూ.ఏడువేల కోట్లలో రూ.3500 కోట్ల ను వ్యవసాయశాఖ ఖాతాలోకి జమచేశామన్నారు. సంగారెడ్డి జిల్లాలో 20వేల మందికిపైగా రైతులకు ఓకే విడత రుణమాఫీ చేశామన్నారు. అగ్రికల్చర్ అధికారులు వ్యవసాయ ప్రణాళికను తయారుచేసుకోవాలన్నారు. కార్యక్రమంలో వ్యవసాయశాఖ, ఇతర శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.