సారథి న్యూస్, యాదాద్రి: యాదాద్రి ఆంజనేయ, నరసింహ అరణ్యం అర్బన్ ఫారెస్ట్ పార్కులను దేవాదాయశాఖ మంత్రి ఎ.ఇంద్రకరణ్‌రెడ్డి, రాజ్యసభ్య సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ శుక్రవారం ప్రారంభించారు. అరణ్యంలో కాలినడకన తిరుగుతూ సందర్శకుల కోసం ఏర్పాటుచేసిన సౌకర్యాలను పరిశీలించారు. అటవీశాఖ ప్రాంతాన్ని వ్యూ పాయింట్ నుంచి తిలకించారు. హరితహారం లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూనే మరోవైపు అడవులను కాపాడుకునేందుకు అత్యంత కఠినంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని వెల్లడించారు. సీఎం కె.చంద్రశేఖర్ రావు ఆలోచనలకు అనుకూలంగా హైదరాబాద్ నలువైపులా ఇతర పట్టణాలకు సమీపంలో ఉండేలా అటవీ భూములను గుర్తించి వాటిలో కొంత భాగాన్ని అర్బన్ లంగ్ స్ప్రేల్ గా అర్బన్ ఫారెస్ట్ పార్క్, ఇకో టూరిజం పార్కులను డెవలప్చేస్తున్నామని చెప్పారు. మంత్రుల వెంట పీసీసీఎఫ్ఆర్ శోభ, అదనపు పీసీఎఫ్ లు లోకేష్ జైస్వాల్, చంద్రశేఖర్ రెడ్డి, డీఎఫ్‌వో డీవీరెడ్డి, ఏపీఎప్ శ్రీనివాస్ ఉన్నారు.
- July 4, 2020
- Archive
- Top News
- జాతీయం
- నల్లగొండ
- CM KCR
- TOURISM
- YADADRI
- యాదాద్రి
- సీఎం కేసీఆర్
- Comments Off on అదిగదిగో అర్బన్‌పార్క్