హైదరాబాద్: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అడ్మిషన్ల ప్రక్రియను ప్రారంభించింది. బీఏ, బీకాం, బీఎస్సీ తదితర డిగ్రీ కోర్సులు, ఎంఏ, ఎంకాం, ఎంఎస్సీ, ఎంబీఏ లాంటి మాస్టర్ కోర్సులతో పాటు పీజీ డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సుల్లో అడ్మిషన్లు పొందాలనుకునేవారు దరఖాస్తు చేసుకోవచ్చని కోరింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్టడీ సెంటర్లలో దరఖాస్తుచేసుకోవచ్చు. ఆసక్తి గల అభ్యర్థులు http://braou.ac.in/ లేదా https://www.braouonline.in/ వెబ్‌సైట్లలో మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. ఫీజు చెల్లించడానికి 2020 సెప్టెంబర్ 10 చివరి తేదీగా నిర్ణయించారు. ఇక ఇప్పటికే అడ్మిషన్లు పొందిన విద్యార్థులు సెకండియర్, థర్డ్ ఇయర్ ఫీజును 2020 సెప్టెంబర్ 10లోగా ఆన్‌లైన్‌లో చెల్లించొచ్చు. మరిన్ని వివరాలకు యూనివర్సిటీ హెల్ప్ డెస్క్ 7382929570, 580, 590, 600 నంబర్లు, ఇన్ఫర్మేషన్ సెంటర్ 040-23680333, 555 నంబర్లకు కాల్చేయొచ్చు.
- August 21, 2020
- Archive
- స్టడీ
- ADMISSIONS
- AMBEDKAR
- HYDERABAD
- OPEN UNIVERSITY
- అడ్మిషన్లు
- అంబేద్కర్
- ఓపెన్యూనివర్సిటీ
- హైదరాబాద్
- Comments Off on అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో అడ్మిషన్లు షురూ