Breaking News

అదిరిందయ్యా.. నందు

అదిరిందయ్యా.. నందు

కొన్ని చిత్రాల్లో కీలకమైన రోల్స్ చేయడమే కాకుండా ‘సవారి’ సినిమాతో హీరోగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు నందు. తన నెక్ట్స్ మూవీ ‘బొమ్మ బ్లాక్ బస్టర్’. శుక్రవారం నందు పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రంలో తన రోల్ కు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ‘ఫలక్ నుమా దాస్’ ఫేమ్ హీరో విశ్వక్ సేన్ ఈ పోస్టర్ ను రిలీజ్ చేశాడు. ‘పోతురాజు’గా నందు ఈ చిత్రంలో కనిపించనున్నాడు. నుదిటిమీద చంద్రవంక బొట్టు, రాచరికపు దుస్తులు, గుబురు గడ్డం, మెలితిప్పిన మీసంతో రాజులా కనిపిస్తున్నాడు.

ఈ చిత్రంలో దర్శకుడు పూరి అభిమాని క్యారెక్టర్ తో కనిపించనున్నాడట. రోల్ కూడా మంచి చాలెంజింగ్ గా ఉంటుందని టీమ్ అంటున్నారు. ఈ చిత్రానికి రాజ్ విరాట్ దర్శకత్వం వహిస్తుండగా రష్మీ గౌతమ్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ప్రవీణ్ పగడాలా, బోసుబాబు నిడుమోలు, ఆనంద్ రెడ్డి, మద్ది మనోహర్ రెడ్డి ఈడ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.