Breaking News

రైతు కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ షర్మిల

రైతు కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ షర్మిల

సామాజిక సాథి, పరకాల;  హన్మకొండ జిల్లా పరకాల మండలం లక్మిపురం గ్రామానికి చెందిన పల్లెబోయిన సురేష్ ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాన్ని   హైదరాబాద్ లోటస్ పాండ్ లో వైఎస్ ఆర్ తెలంగాణ పార్టీ అధినాయకురాలు వైఎస్  షర్మిల  పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె  మాట్లాడుతూ తెలంగాణలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాల తరుపున ప్రభుత్వం పై పోరాటం చేస్తూ అండగా ఉంటానని భరోసా కల్పించారు. రైతుల,  నిరుద్యోగుల ,  దళితుల పట్ల అన్ని వర్గాల ప్రజల పట్ల కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని,  రాష్ట్రంలో ముఖ్యమంత్రి గా కేసీఆర్ కు కొనసాగే అర్హత లేదని వెంటనే రాజీనామా చేయాలని ఘాటుగా విమర్శించారు. కార్యక్రమంలో వైస్ ఆర్సీపీ వరంగల్ పార్లమెంట్ కో కన్వీనర్ ఆముదాలపెల్లి మల్లేశం గౌడ్ తదితరులు పాల్గొన్నారు.