సామాజిక సారథి, తిమ్మాజీపేట: అనారోగ్య స్థితిలో ఉన్న తన స్నేహితుడికి ఆర్థిక సహాయం చేసి స్నేహమంటే ఇదేరా అనిపించుకుకున్నారు కొంతమంది పదోతరగతి బ్యాబ్ మేట్స్. నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట గ్రామానికి చెందిన పకీర రాములుకు నెలరోజుల క్రితం యాక్సిడెంట్లో కుడికాలుకు గాయాలయ్యాయి. దీంతో వారి కుటుంబం గడవలేని స్థితిలో ఉంది. ఈ విషయం తెలుసుకున్న 2002లో పదోతరగతి చదివిన తోటి బాల్యమిత్రులు వెంటనే రాములు ఇంటికి వెళ్లి రూ.35వేల నగదు, క్విటాల్ బియ్యం, నూనె, రెండు నెలలకు సరిపడా నిత్యావసర సరుకులు అందజేసి ధైర్యం అందించారు. ఈ విషయం స్థానికులు తెలవగానే స్నేహితులంటే ఇలా ఉండాలని మాట్లాడుకున్నారు. తమ మిత్రుడిని కలిసిన వారిలో మధు, చంద్రశేఖర్ రెడ్డి, శ్రీను, నరసింహ తదితరులు ఉన్నారు.
- December 13, 2021
- Archive
- లోకల్ న్యూస్
- Comments Off on అవునూ.. స్నేహమంటే ఇదే