సారథి న్యూస్, నాగర్కర్నూల్: గ్రామ పంచాయతీ, మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్చేస్తూ తెలంగాణ గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్, తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ఆధ్వర్యంలో శుక్రవారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని గాంధీపార్కులో ధర్నా నిర్వహించారు. అనంతరం ర్యాలీగా వెళ్లి కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు మాట్లాడుతూ.. పంచాయతీ, మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం రూ.24వేలు ఇవ్వాలని డిమాండ్చేశారు. పోరాడి సాధించుకున్న రూ.8,500 జీతాన్ని ఇప్పటికీ పంచాయతీ కార్మికులకు ఇవ్వడం లేదన్నారు. జీవోనం.20,26 తీసుకొచ్చి ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లను కడగాలనే నిబంధన పెట్టడం సరికాదన్నారు. వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడంలో భాగంగా మల్టీపర్పస్ విధానాన్ని తీసుకొచ్చారని అన్నారు. జీవోనం.51ను సవరించాలని, పంచాయతీ కార్మికులకు రూ.19వేల వేతనం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్చేశారు. ఈఎస్ఐ, పీఎఫ్ ను పకడ్బందీగా అమలుచేయాలని, ప్రతినెలా 5వ తేదీలోపు వేతనాలు చెల్లించాలని కోరారు. కార్యక్రమంలో గ్రామపంచాయతీ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వెంకటేష్, మహేష్, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు వెంకట్రాములు, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు పొదిల రామయ్య, కేవీపీఎస్జిల్లా కార్యదర్శి లక్ష్మణ్, ఉపాధ్యక్షుడు అంతటి కాశన్న, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కొంపల్లి అశోక్ తిరుపతయ్య, వెంకటస్వామి, బాలస్వామి, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.
- February 12, 2021
- Archive
- మహబూబ్నగర్
- లోకల్ న్యూస్
- CITU
- EPF
- ESI
- NAGARKURNOOL
- PANCHAYATH LABOUR
- ఈఎస్ఐ
- ఈపీఎఫ్
- నాగర్కర్నూల్
- పంచాయతీ కార్మికులు
- సీఐటీయూ
- Comments Off on కార్మికుల ఆత్మస్థైర్యం దెబ్బతీయొద్దు