-జర్నలిస్టుల ఇండ్ల స్థలాల పంపిణీ పై వెల్లువెత్తుతున్న విమర్శలుసీనియర్,
–దళిత జర్నలిస్టులను పట్టించుకోని మంత్రి పీఆర్వో
-ఇష్టారాజ్యంగా అనర్హులకు ఇండ్ల పట్టాల పంపిణీ -దుమ్మెత్తిపోస్తున్న ప్రతిపక్ష పార్టీల నాయకులుజర్నలిస్ట్ యూనియన్లను
– అసహ్యించుకుంటున్న తోటి జర్నలిస్టులుఅర్హులకు న్యాయం చేయాలంటున్న జర్నలిస్టులు
సామాజిక సారథి, వనపర్తి బ్యూరో:.వనపర్తి జిల్లాలో జర్నలిస్టుల ఇండ్ల స్థలాల పంపిణీ అస్థవ్యస్థంగా మారింది. కనీస ప్రభుత్వ నిభందనలను పాటించకుండా పైరవీలు చేస్తూ లక్షాధికారులుగా ఎదిగిన వారికి, ఇప్పటికే తమ కుటుంభ సభ్యులు గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తున్నవారికి, జర్నలిజంలో ఓనమాలు రాకున్నా అంగట్లో అక్రిడిషేన్ కార్డులు కొన్న వారికి ఇండ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేసి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోనే వనపర్తి జిల్లా ప్రత్యేక పేరును సంపాధించుకోవడం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్వంత నియోజకవర్గం అయిన వనపర్తి జిల్లాలో జర్నలిస్టులతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంతో పాటు పలు మార్లు సమావేశాలు నిర్వహించి జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల పంపిణి పై స్పష్టమైన హామి ఇచ్చారు. వనపర్తి జిల్లాలో అక్రిడేషన్ కార్డు ఉన్న వారితో పాటు అక్రిడేషన్ కార్డు లేని వారికి సైతం తప్పనిసరిగా ఇళ్ల పట్టాలు అందజేస్తానని ప్రకటించడంతో జిల్లాలోని జర్నలిస్టులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ఆ దిశగా మంత్రి నిరంజన్ రెడ్డి సైతం ఇళ్ల స్థలాల పంపిణీ బాధ్యతను పీఆర్వో సందీప్ రెడ్డి కి అప్పగించారు. కాని మంత్రి పీఆర్వో సందీప్ రెడ్డి అత్యుత్సాహం, జర్నలిస్ట్ లపై చిన్నచూపు, లోపాయికారి ఒప్పందాలతో ఏకంగా మంత్రి నిరంజన్ రెడ్డి నే తప్పు దోవ పట్టించి అనర్హులకు ఇండ్ల స్థలాల పట్టాల జాబీతాను తయారు చేయడం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో సంచలనంగా మారింది. పీఆర్వో సందీప్ రెడ్డి పై మంత్రి నిరంజన్ రెడ్డ్ పెట్టుకున్న నమ్మకాన్ని తుంగలో తొక్కి జర్నలిస్టు యూనియన్ నాయకులతో చెట్టపట్టాలు వేసుకొని అడ్డగోలు జాబీతాను సిద్దం చేసి లక్షాధికారులకు, ఇది వరకే ఇళ్ల పట్టాలు పొందిన వారికి, ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ అర్థికంగా ఉన్నవారికి ఇళ్ల పట్టాలు పంపిణి చేయడం పెద్ద దుమారం రేగింది.
దుమ్మెత్తి పోస్తున్న ప్రతి పక్ష పార్టీలు…
వనపర్తి జిల్లాలో అటు నిరుపేదలకు, ఇటు అర్హులైన జర్నలిస్టులకు ఇంటి స్థలాలను ఇవ్వకుండా అధికార పార్టీకి అనుకూలంగా ఉన్న వారికి ఇళ్ల స్థలాలను పంపిణి చేయడంపై ప్రతి పక్ష పార్టీల నాయకులు దుమ్మెత్తి పోస్తున్నారు. ప్రభుత్వ నిభందనల ప్రకారం ప్రభుత్వ భూములను అర్హులకు ఇండ్ల స్థలాలను పంపిణి చేయాల్సీ ఉన్నా వనపర్తి లో మాత్రం అధికార పార్టీ నాయకులు తమ స్వంత నిధులతో తమ స్వంత ట్రస్ట్ పేరిట ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు హంగామా చేయడం ఏంటనీ ప్రశ్నిస్తున్నారు. ఇండ్ల పట్టాల పంపిణీ కి ఏ రూల్స్ పాటించారో చెప్పాలని అర్హులను వదిలేసి అడ్డగోలుగా సంపాదించి పైరవీలు చేసే వారికి ఇళ్ల స్థలాలు ఎలా పంపిణీ చేశారో చెప్పాలని ప్రతి పక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అర్హులైన జర్నలిస్టులకు సైతం ఇండ్ల స్థలాలు ఇవ్వకుండా తమకు అనుకూలంగా ఉన్న వారికి ఇండ్ల స్థలాలు ఇవ్వడం తగదని బహిరంగంగానే విమర్శిస్తున్నారు. వనపర్తి లో అర్హులైన ప్రతి జర్నలిస్టు కు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్, బీజేపీ నాయకులు బచ్చురాము, తెలంగాణ జనసమితి జిల్లా అధ్యక్షులు ఖాధర్ పాష, అఖిలపక్ష ఐక్య వేదిక కన్వీనర్ సతీష్ యాదవ్ లు జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు.
యూనియన్లను అసహ్యించుకుంటున్న తోటి జర్నలిస్టులు..
వనపర్తి జిల్లాలో జర్నలిస్టుల ఇళ్ల పట్టాల పంపిణీ లో అనర్హులకు పెద్దపీట వేయించి పట్టాలు పొందడంపై అర్హత గల తోటి జర్నలిస్టులు జర్నలిస్టు యూనియన్లను అసహ్యించుకుంటున్నారు. వనపర్తి జిల్లాలో మూడు జర్నలిస్ట్ యూనియన్లు ఉన్నాయని బయటికి చెప్పుకుంటున్నా తమ అవసరాల కోసం అంతా సిండికేట్ గా మారి ఒక్క తాటిపైనే ఉంటాయన్నవిషయం ఇంటి పట్టాల పంపిణీతో వెలుగులోకి వచ్చింది. కేవలం యూనియన్ నాయకులు తమ పదవుల కోసం, తమ ఉనికి కోసం తోటి జర్నలిస్టులను యూనియన్ల పేరుతో వాడుకుంటూ వారి స్వంత అవసరాలను తీర్చుకుంటున్నారన్న విషయం భయటపడడంతో వనపర్తి జిల్లాలో తోటి జర్నలిస్టులు యూనియన్ల పై మండి పడుతున్నారు. జర్నలిజాన్ని బ్రోకరిజంగా మార్చడంతో పాటు తమకు అనుకూలమైన వారి పేర్లు మూకుమ్మడిగా సిద్దం చేయించడం ఆ జాబీతాలను మంత్రి పీఆర్వో సందీప్ రెడ్డి ఎలాంటి విచారణ చేయకుండా పట్టాలు సిద్దం చేసి ఇళ్ల స్థలాలను పంపిణి చేయడంపై జర్నలిస్టులు మండిపడుతున్నారు. తమకు జరిగిన అన్యాయాన్ని యూనియన్ నాయకులు చేస్తున్న బ్రోకరిజం పై కొందరు విలేకరులు సోషల్ మీడియా వేదికగా ప్రతి రోజు ఎదురు దాడికి దిగడంతో మంత్రి క్యాంప్ కార్యాలయంతో పాటు యూనియన్ నాయకులు ఉలిక్కిపడుతున్నారు. దీంతో రెండు రోజుల క్రితం ఎవరైతే సోషల్ మీడియాలో జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తున్నారో వారిని పిలిపించి పాట్ల పట్టాలు పంపిణీ చేయడం విశేషం. కొంత మంది విలేకరుల పేర్లు జాబీతాలో ఉన్నా వారిని తప్పించి వారి స్థానంలో నిలదీసే వారికి చోటు కల్పించి దిద్దుబాటు చర్యలకు మంత్రి కార్యాలయం సిబ్బంది, యూనియన్ నాయకులు పాల్పడుతుండడాన్ని చూస్తే వనపర్తి లో ఇండ్ల పట్టాల పంపిణి ఎంత దిగజారుడుతనంతో చేశారో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఇండ్ల స్థలాల పంపిణీ జాబీతాను అటు రెవెన్యూ అధికారులు, ఇటు యూనియన్ నాయకులు బయటికి పొక్కకుండా జాగ్రత్త పడడంతోపాటు మంత్రి నిరంజన్ రెడ్డి ని తప్పుదోవ పట్టించి తమ పబ్బం గడుపుకుంటున్న విషయం తెలుస్తోంది. ఇప్పటికైనా మంత్రి నిరంజన్ రెడ్డి ఇండ్ల స్థలాల పంపిణి వాస్తవాలు తెలుసుకొని జరిగిన తప్పులను సరిదిద్దాలని జిల్లా జర్నలిస్టులు కోరుతున్నారు. ఇప్పటికే అర్హులకు న్యాయం చేయకుండా అనర్హులకు పట్టాలు ఇవ్వడంపై కొందరు జర్నలిస్టులు జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేయడంతో పాటు లోకాయుక్తను ఆశ్రయిస్తున్నట్లు తెలిపారు. ఏది ఏమైనా మంత్రి పీఆర్వో సందీప్ రెడ్డి, జర్నలిస్ట్ యూనియన్ నాయకులు చేసిన తప్పిదాలు మంత్రి నిరంజన్ రెడ్డి కి చెడ్డ పేరు తేవడంతో పాటు భారీ వ్యతిరేకతను మూట కట్టుకున్నదని తెలుస్తోంది.