సారథి, జగిత్యాల: జగిత్యాల మండలం వెల్దుర్తి గ్రామం బావాజీపల్లికి చెందిన టీఆర్ఎస్ సీనియర్ కార్యకర్త కె.రామకృష్ణ అనారోగ్యం చనిపోయారు. అలాగే వెల్దుర్తి గ్రామానికి కండ్లే గౌతమ్ గుండెపోటుతో మరణించగా వారి కుటుంబసభ్యులను ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ శనివారం పరామర్శించారు. అలాగే జగిత్యాల రూరల్ మండల జాబితాపూర్ గ్రామానికి చెందిన టీఆర్ఎస్ కార్యకర్త నాంసాని సాయి తండ్రి రాజన్న ఇటీవల రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. మాజీ ఎంపీటీసీ సుగుణ తండ్రి భారత దావీదు అనారోగ్యంతో మరణించగా వారి కుటుంబసభ్యులను కూడా పరామర్శించి ఓదార్చి ధైర్యం చెప్పారు. ఆయన వెంట రూరల్ ఎంపీపీ రాజేంద్రప్రసాద్, మార్కెట్ కమిటీ చైర్మన్ దామోదర్ రావు, సహకార సంఘం చైర్మన్ మహిపాల్ రెడ్డి, పార్టీ మండలాధ్యక్షుడు బాల ముకుందాం, సర్పంచ్ బుర్ర ప్రవీణ్, మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు మహేష్, రాజేశ్వర్ రెడ్డి, శేఖర్, మహేష్, గంగారెడ్డి, రాకేష్, ప్రశాంత్, రాంకిషన్ పాల్గొన్నారు.
- June 13, 2021
- Archive
- కరీంనగర్
- లోకల్ న్యూస్
- JAGITYALA
- mla sanjay
- TRS
- ఎమ్మెల్యే సంజయ్
- జగిత్యాల
- టీఆర్ఎస్
- Comments Off on దు:ఖంలో ఉండగా.. ఎమ్మెల్యే ఓదార్పు