- ఒమిక్రాన్ తాజా పరిస్థితిపై ఈసీ సమీక్ష
- కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులతోచర్చలు
- ఐదు రాష్ట్రాల్లో వేగంగా వ్యాక్సినేషన్
- జనవరిలో మరోమారు సమావేశం
- ఎలక్షన్నిర్వహణపై అప్పుడే నిర్ణయం
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియంట్ విస్తరిస్తున్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ సహా ఐదు రాష్ట్రాల ఎన్నికలపై ఏంచేయాలనే అంశంపై సీఈసీ ఫోకస్ పెట్టింది. కేంద్ర ఆరోగ్యశాఖ ఉన్నతాధికారు లతో సోమవారం సమావేశం నిర్వహించింది. ఆరోగ్యశాఖ సమాచారం ఆధారంగా.. ఎన్నికల నిర్వహణపై తుదినిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై ప్రధానంగా చర్చ నడిచింది. అయితే వచ్చే జనవరి 22న మరోసారి భేటీ కావాలని నిర్ణయించుకున్నారు. ఈ సమావేశం తర్వాతే ఎన్నికలను నిర్వహించాలా..? వద్దా..? అన్న విషయంలో ఈసీ తుది నిర్ణయాన్ని ప్రకటించనుంది. దేశంలో ఒమిక్రాన్ కేసుల పెరుగుదల, వ్యాక్సినేషన్ ప్రక్రియ గురించి ప్రధానంగా చర్చించారు. ప్రచారం, పోలింగ్, కౌంటింగ్ అంశాల్లో కొవిడ్ 19 ప్రొటోకాల్ పై కేంద్ర ఆరోగ్యశాఖ నుంచి సూచనలు కోరింది. కొత్త వేరియంట్ ఒమిక్రాన్, కొవిడ్ కేసులపై దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కవరేజ్ స్థితిపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం ఎన్నికల కమిషన్‌కు నివేదిక సమర్పించింది. వచ్చే మూడు నెలల్లో ఒమిక్రాన్ వ్యాప్తి గురించి అడగ్గా.. ప్రస్తుతానికి ఏమీ చెప్పలేమని ఆరోగ్య కార్యదర్శి రాజేశ్ భూషణ్ వెల్లడించినట్లు సమాచారం. ప్రస్తుతం ఉన్న ఇన్ఫెక్షన్ రేటు ప్రకారం కొద్దినెలల్లో 25 శాతం పెరగవచ్చని ఆయన చెప్పారు.
భయపెడుతున్న ఒమిక్రాన్
ఓవైపు ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తుంటే, మరోవైపు కొత్త రకం కరోనా వైరస్ ‘ఒమిక్రాన్’ దేశంలో గుబులురేపుతోంది. క్రమక్రమంగా కేసుల సంఖ్య పెరగడంతో దేశ రాజధాని ఢిల్లీ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర సహా చాలాచోట్ల క్రిస్మస్, కొత్త సంవత్సర వేడుకలు, సభలు, సమావేశాలు, సమూహాలుగా ఏర్పడే కార్యక్రమాలపై ఆయా ప్రభుత్వాలు ఆంక్షలు విధించాయి. పరిస్థితులు చూస్తుంటే సెకండ్ వేవ్ ముందు నాటి వాతావరణాన్ని తలపిస్తోంది. గతంలో ఎన్నికల సభలు, ర్యాలీల కారణంగా గత తమిళనాడు, బెంగాల్, అస్సాం రాష్ట్రాల్లో కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. మద్రాస్ హైకోర్టు ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తూ ఎన్నికల సభలను అనుమతించిన కేంద్ర ఎన్నికల సంఘంపై హత్యానేరం కింద కేసు నమోదు చేయాలని అప్పట్లో తీవ్రవ్యాఖ్యలు చేసింది. ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీశాయి. ఇప్పుడు మళ్లీ ఆ తరహాలో న్యాయస్థానాలతో చీవాట్లు పెట్టించుకునే ఆలోచనలో కేంద్ర ఎన్నికల సంఘం లేదని స్పష్టమవుతోంది. ఓవైపు ఏర్పాట్లను సమీక్షించుకుంటూనే, మరోవైపు ఎన్నికల నిర్వహణకు తగిన వాతావరణం ఉందా? లేదా? అన్నది తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది.
వ్యాక్సినేషన్‌పై దృష్టి
ఉత్తరప్రదేశ్, మణిపూర్, ఉత్తరాఖండ్, గోవా, పంజాబ్ రాష్ట్రాలకు 2022లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఏర్పాట్లను కేంద్ర ఎన్నికల సంఘం సమీక్షిస్తూ వస్తోంది. ఇటీవల పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా రాష్ట్రాల్లో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సుశీల్ చంద్ర నేతృత్వంలోని కేంద్ర ఎన్నికల సంఘం అధికారుల బృందం స్వయంగా పర్యటించింది. డిసెంబర్ 28,30 తేదీల మధ్య పెద్దరాష్ట్రమైన ఉత్తర్ ప్రదేశ్ లో ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించేందుకు పర్యటన ఖరారు చేసుకుంది. కొత్త ఓటర్ల నమోదు, లోపాలు లేని ఓటర్ల జాబితా, ఎన్నికల్లో హింస జరగకుండా అవసరమైన కేంద్ర పారామిలటరీ బలగాలు, ఎలక్షన్డ్యూటీలో పాల్గొనే సిబ్బందికి రెండు డోసుల వ్యాక్సినేషన్‌తో పాటు అవసరమైన బూస్టర్ డోస్ వంటి అనేక కీలకఅంశాలను పరిగణలోకి తీసుకుంటూ కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది.
దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియంట్ విస్తరిస్తున్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ సహా ఐదు రాష్ట్రాల ఎన్నికలపై ఏంచేయాలనే అంశంపై సీఈసీ ఫోకస్ పెట్టింది. కేంద్ర ఆరోగ్యశాఖ ఉన్నతాధికారు లతో సోమవారం సమావేశం నిర్వహించింది. ఆరోగ్యశాఖ సమాచారం ఆధారంగా.. ఎన్నికల నిర్వహణపై తుదినిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై ప్రధానంగా చర్చ నడిచింది. అయితే వచ్చే జనవరి 22న మరోసారి భేటీ కావాలని నిర్ణయించుకున్నారు. ఈ సమావేశం తర్వాతే ఎన్నికలను నిర్వహించాలా..? వద్దా..? అన్న విషయంలో ఈసీ తుది నిర్ణయాన్ని ప్రకటించనుంది. దేశంలో ఒమిక్రాన్ కేసుల పెరుగుదల, వ్యాక్సినేషన్ ప్రక్రియ గురించి ప్రధానంగా చర్చించారు. ప్రచారం, పోలింగ్, కౌంటింగ్ అంశాల్లో కొవిడ్ 19 ప్రొటోకాల్ పై కేంద్ర ఆరోగ్యశాఖ నుంచి సూచనలు కోరింది. కొత్త వేరియంట్ ఒమిక్రాన్, కొవిడ్ కేసులపై దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కవరేజ్ స్థితిపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం ఎన్నికల కమిషన్‌కు నివేదిక సమర్పించింది. వచ్చే మూడు నెలల్లో ఒమిక్రాన్ వ్యాప్తి గురించి అడగ్గా.. ప్రస్తుతానికి ఏమీ చెప్పలేమని ఆరోగ్య కార్యదర్శి రాజేశ్ భూషణ్ వెల్లడించినట్లు సమాచారం. ప్రస్తుతం ఉన్న ఇన్ఫెక్షన్ రేటు ప్రకారం కొద్దినెలల్లో 25 శాతం పెరగవచ్చని ఆయన చెప్పారు.