సారథి న్యూస్, మెదక్: రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం మెదక్ ఆర్అండ్ బీ గెస్ట్ హౌస్లో మెదక్ నియోజకవర్గ పరిధిలోని 25 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరైన రూ.15లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, మెదక్ జడ్పీ వైస్ చైర్ పర్సన్ లావణ్యరెడ్డి, నిజాంపేట్ జడ్పీటీసీ పంజా విజయ్ కుమార్, కౌన్సిలర్ ఆర్ కే శ్రీనివాస్ జయరాజ్, వసంత్ కుమార్, మాజీచైర్మన్ రాగి అశోక్, పాపన్నపేట సర్పంచ్ గురుమూర్తి గౌడ్, లింగారెడ్డి, నర్సింలు, జయరాంరెడ్డి, జగదీశ్ తదితరులు పాల్గొన్నారు.
- January 19, 2021
- Archive
- మెదక్
- లోకల్ న్యూస్
- CM RELIEF FUND
- IFCO
- medak
- ఇఫ్కో
- మెదక్
- సీఎం రిలీఫ్ ఫండ్
- Comments Off on అన్ని సామాజిక వర్గాలకు సంక్షేమ పథకాలు